మరో సినిమాని కూడా లైన్లో పెట్టిన రవితేజ !

Published on Oct 18, 2020 6:03 pm IST

మాస్ మహరాజా రవితేజకి ప్రస్తుతం వరుస సినిమాలను అంగీకరిస్తూ ముందుకు పోతున్నాడు. “రాక్షసుడు” తో హిట్ అందుకున్న రమేష్ వర్మతో ఒక సినిమాని ఈ రోజున స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ రాసిన కథతో, ‘నేను లోకల్’ ఫేమ్ నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో కూడా రవితేజ డిసెంబర్ నుండి ఓ సినిమా చెయ్యటానికి ప్లాన్ చేస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ అట, ముఖ్యంగా సినిమాలో రవితేజ క్యారెక్టరైజేషన్ ఫుల్ కామెడీ టైమింగ్ తో అద్భుతంగా ఉంటుందట.

ఎలాగూ తన మాడ్యులేషన్ తోనే అద్భుతమైన కామెడీని పండించగలడు రవితేజ. నిజానికి కిక్ తరువాత రవితేజ మళ్లీ ఆ రేంజ్ కామెడీ సినిమా చెయ్యలేదనే చెప్పాలి. ఈ సారి రవితేజ ప్రేక్షకులను ఫుల్ గా నవ్వించడం ఖాయంలా కనిపిస్తుంది. అన్నట్టు రవితేజ ప్రస్తుతం క్రాక్ మూవీలో నటిస్తున్నాడు. అలాగే రమేష్ వర్మ డైరక్షన్ లో మొదలుపెట్టిన సినిమాని కూడా డిసెంబర్ లోపు పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి మాస్ మహరాజా రవితేజకి వరుస సినిమాలతో బిజీ అయ్యాడు.

సంబంధిత సమాచారం :

More