పీరియాడిక్ కామెడీ డ్రామాలో రవితేజ ?

పీరియాడిక్ కామెడీ డ్రామాలో రవితేజ ?

Published on Aug 9, 2020 2:06 AM IST

రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ రాసిన కథతో, ‘నేను లోకల్’ ఫేమ్ నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చెయ్యటానికి ఒప్పుకున్న సంగతి తెలిసిందే. కరోనా రాకపోయి ఉంటే… ఈ పాటికే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లేది. అయితే ఈ సినిమా గురించి ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఈ సినిమా 1980ల నేపథ్యంలో నడుస్తుందని, రెట్రో ఫీల్ గట్టిగా ఉంటుందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. అలాగే ఈ సినిమా ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ అట, ముఖ్యంగా సినిమాలో రవితేజ క్యారెక్టరైజేషన్ ఫుల్ కామెడీ టైమింగ్ తో అద్భుతంగా ఉంటుందట.

ఇక రవితేజ ఇటీవల చేసిన చిత్రం ‘డిస్కో రాజా’. విఐ.ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో 80ల బ్యాక్ డ్రాప్ కూడా ఉంటుంది. సినిమా పెద్ద విజయం అందుకోకపోయినా ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ప్రేక్షకులకు నచ్చాయి. అందుకే రవితేజ మరోసారి అదే స్టైల్ ఫాలో అవుతున్నాడు. ఎలాగూ త్రినాథరావ్ నక్కినకి మంచి కామెడీ డైరెక్టర్ అని పేరు ఉంది. ఆయన గత చిత్రాలు కూడా ‘సినిమా చూపిస్తా మామ’ ‘నేను లోకల్ వంటి కామెడి సినిమాలు మంచి ఎంటెర్టైమెంట్ తో సాగుతూ సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమా కూడా అలాగే సాగుతుందట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు