‘ఖిలాడి’లో మార్పులు.. జులైకి పోస్ట్ ఫోన్ ?

Published on May 3, 2021 6:02 pm IST


రవితేజ ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆ మధ్య ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టీజర్ కూడా బాగానే ఆకట్టుకుంది. అయితే, ప్రస్తుతం కరోనా సెకెండ్ వేవ్ కారణంగా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. వచ్చే నెల నుండి లాస్ట్ షెడ్యూల్ షూట్ ను పూర్తి చేయనున్నారు. ఈ సినిమాని మొదట మే 28న రిలీజ్ చేయాలనుకున్నారు. ఇక ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ డేట్ ను జులైకి పోస్ట్ ఫోన్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక 2021ని విజయవంతంగా ప్రారంభించారు మాస్ మహారాజ రవితేజ.

కాగా ‘క్రాక్ ‘ విజయంతో ఖిలాడి సినిమా పై అంచనాలు కూడ భారీగా పెరిగాయి. అందుకే డైరెక్టర్ రమేష్ వర్మ సినిమాలో మాస్ కంటెంట్ ఏ మాత్రం తగ్గకుండా ఉండేలా చూసుకుంటున్నారట. యాక్షన్ ఎపిసోడ్ల మీద మరింత దృష్టి పెట్టారట. కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి మరియు డింపుల్ హయాతిలు కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :