మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఇరుముడి’ బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ఫుల్ రన్ కొనసాగిస్తోంది. శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటంతో ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్‌గా అవతరించింది. ఇక ఈ చిత్ర సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న రవితేజ, అప్పుడే తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ని కూడా అనౌన్స్ చేశాడు.
తాను నెక్స్ట్ ప్రాజెక్ట్‌ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, శిరీష్‌ల కాంబినేషన్లో చేసేందుకు రెడీ అయినట్లు రవితేజ ప్రకటించారు. ఈ నయా ఎంటర్టైనర్ను దర్శకుడు హసిత్ గోలి డైరెక్ట్ చేయనున్నాడు. ఇక ఈ చిత్రానికి ‘దాగుడు మూతల దండాకోర్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్.
ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తామని మేకర్స్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అయితే, ఈ సినిమాలో శ్రీవిష్ణు మరో హీరోగా నటించబోతున్నాడనే వార్తలు గతకొద్ది రోజులు హల్చల్ చేస్తున్నాయి. 2027 సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ త్వరలో రానున్నాయి.
Super congratulations to our Mass Maharaja @RaviTeja_offl garu not just for delivering a BLOCKBUSTER but also for reviving the BOX OFFICE and FOOTFALLS in a way we haven’t seen in recent times with #IRUMUDI 💥💥💥
Now, gear up for a MOST ENTERTAINING & ABSOLUTELY REFRESHING… pic.twitter.com/XOXds0E5et
— Sri Venkateswara Creations (@SVC_official) August 25, 2026


