తండ్రి కొడుకులుగా నటించనున్న మాస్ రాజా !
Published on Jun 28, 2018 1:09 am IST

మాస్ మహారాజ్ రవితేజ ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా , ఒక్క క్షణం ‘చిత్రాల దర్శకుడు వి . ఐ ఆనంద్ తెరకెక్కించనున్న చిత్రంలో నటించనున్నాడు అని తెలిసిందే ఇక ఈ చిత్రంలో ఆయన ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు . అందులో ఒకటి కొడుకు పాత్ర కాగా మరొకటి తండ్రి పాత్ర అని తెలుస్తుంది . రవితేజ గతంలో విక్రమార్కుడు , కిక్ 2 చిత్రాల్లో రెండు పాత్రల్లో నటించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి డిస్కో రాజా అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

ఇక ప్రస్తుతం రవితేజ శ్రీను వైట్ల తెరకెక్కిస్తున్న’ అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రంలో నటిస్తున్నాడు . ఈ చిత్రాన్ని కూడా మైత్రి మూవీ మేకర్సే నిర్మిస్తుండడం విశేషం . ఇలియానా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు .

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook