లునార్ బ్రాండ్ అంబాసిడర్ గా రవితేజ

లునార్ బ్రాండ్ అంబాసిడర్ గా రవితేజ

Published on May 13, 2015 12:30 PM IST

raviteja

మాస్ మహారాజ రవితేజ తన సినిమాలతో ఆడియన్స్ ని భీభత్సంగా ఎంటర్ టైన్ చేసాడు. కానీ బయట మాత్రం చాలా లో ప్రొఫైల్ మెయిన్టైన్ చేస్తుంటాడు. సినిమాల్లో మాత్రమే కనిపించే రవితేజ బయట ఈవెంట్స్ లో కూడా తక్కువగా కనపడుతుంటాడు. ఇప్పటి వరకూ సినిమాలతోనే మెప్పించిన రవితేజ మొదటి సారి ఓ ప్రోడక్ట్ కి బ్రాండ్ అంబాసిడర్ గా సైన్ చేసాడు. బాగా ఫేమస్ అయిన లునార్ – వాక్ మేట్ ఫుట్ వియర్ కి రవితేజ సైన్ చేసాడు.

అంతే కాకుండా ఈ లునార్ – వాక్ మేట కోసం అప్పుడే తన మొదటి యాడ్ షూట్ ని కూడా ఫినిష్ చేసాడు. త్వరలోనే ఈ యాడ్ టీవీలలో ప్రసారం అవుతుంది. రవితేజ లాంటి హీరో ఇలా ప్రోడక్ట్స్ కోసం బ్రాండ్ అంబాసిడర్ గా మారడం మంచి పరిణామం అని అంటున్నారు . రవితేజ నటించిన కిక్ 2 సినిమా విడుదలకు సిద్దమవుతోంది. ఇటీవలే రిలీజ్ అయిన ట్రైలర్ కి, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. కళ్యాణ్ రామ్ నిర్మించిన ఈ సినిమా మే చివర్లో లేద జూన్ మొదట్లో రిలీజ్ కానుంది.

తాజా వార్తలు