రవితేజతో మళ్లీ ప్లాన్ చేస్తున్నాడట ?

Published on Jan 2, 2023 9:12 pm IST

డైరెక్టర్ వి.వి. వినాయక్ రవితేజతో ఓ సినిమా చేయబోతున్నట్లు మళ్లీ రూమర్స్ వినిపిస్తున్నాయి. రీసెంట్ గా రవితేజకి వినాయక్ ఓ కథ చెప్పాడని, రవితేజ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడని తెలుస్తోంది. మరి ఈ రూమర్స్ లో వాస్తవం ఎంత ఉందో గానీ, వినాయక్ సినిమా పై మాత్రం ఎప్పటి నుంచో ఎన్నో పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. కాకపోతే, రవితేజ హీరోగా – వినాయక్ దర్శకుడిగా ఒక సినిమా రాబోతుందనే వార్త తరుచూ వినిపిస్తోంది.

ఈ మధ్య వినాయక్ సక్సెస్ ట్రాక్ లో లేడు. కాబట్టి.. ఎలాగైనా సక్సెస్ ను కొట్టాలనే కసితో వినాయక్ తన తర్వాత సినిమా కోసం పని చేస్తున్నాడట. మరి, రవితేజ ఇమేజ్ కోసం వినాయక్ ఎలాంటి కథ రాశాడో చూడాలి. అన్నట్టు ఆ మధ్య వినాయక్ , బాలయ్యతో కూడా సినిమా చేయాలనుకున్నాడు. ప్రస్తుతానికి అయితే వినాయక్, రవితేజతో మాత్రమే సినిమాని ప్లాన్ చేస్తున్నాడు. ఏది ఏమైనా వినాయక్ సినిమా పై రోజుకొక రూమర్ వినిపిస్తుంది.

సంబంధిత సమాచారం :