రవితేజ వర్కౌట్లు ఆ సినిమా కోసమేనా ?

రవితేజ వర్కౌట్లు ఆ సినిమా కోసమేనా ?

Published on Apr 9, 2020 6:39 PM IST

మాస్ మహారాజా రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. కాగా ఈ సినిమా కోసం రవితేజ బాడీని బిల్డ్ చేస్తున్నాడు. రోజూ నాలుగు గంటలు జిమ్ లో గడుపుతున్నాడు. సినిమాలో ద్విపాత్రాభినయం చేయబోతున్న రవితేజ్ చేస్తోన్న రెండు పాత్రల్లో ఒక పాత్ర ఫుల్ మాస్ క్యారెక్టర్ అట, ఆ పాత్ర కోసమే రవితేజ ప్రస్తుతం బాగా వర్కౌట్స్ చేస్తున్నాడని తెలుస్తోంది. అలాగే మరో పాత్ర ఎన్ఆర్ఐ బిజినెస్ మెన్ పాత్ర అట. బిజినెస్ మెన్ పాత్ర కూల్ గా ఉటుందట.

అయితే ఈ సినిమా రీమేక్ అని వార్తలు వస్తున్నాయి. తమిళంలో అరవింద స్వామి, త్రిష కలయికలో రానున్న ‘శతురంగ వెట్టై 2’ చిత్రాన్నే తెలుగులో రవితేజ చేయబోతున్నాడని ఆ వార్తల సారాంశం. మరి ఇందులో ఎంత నిజం ఉందో చూడాలి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ ను ఫైనల్ చేసిన చిత్రబృందం, అలాగే మరో హీరోయిన్ గా మాళవిక శర్మను తీసుకోనున్నారు.

గతంలో నేల టిక్కెట్టు సినిమాలో మాళవిక రవితేజ సరసన నటించింది. అయితే ఈ వార్తకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కాగా ఈ మధ్య ఆశించిన స్థాయిలో హిట్ అందుకోలేకపోయినప్పటికీ రవితేజ మాత్రం సినిమాల స్పీడ్ ను పెంచుతూనే ఉన్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు