మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. థియేటర్లలో విడుదలైన ఈ సినిమా కలెక్షన్లతో పాటు టికెట్ బుకింగ్స్‌లోనూ భారీ మైలురాయిని అందుకుంది.
ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లు బుక్‌మైషో, జొమాటో డిస్ట్రిక్ట్ యాప్‌లలో కలిపి ఇప్పటివరకు 5.5 మిలియన్లకు పైగా (55 లక్షలకు పైగా) టికెట్లు అమ్ముడైనట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. “రవన్న బాక్సాఫీస్ ర్యాంపేజ్” కొనసాగుతోందంటూ మేకర్స్ విడుదల చేసిన స్పెషల్ పోస్టర్ సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది.
శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించగా.. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పణలో టి-సిరీస్ ఫిల్మ్స్ అసోసియేట్ అయింది. జి.వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. మాస్ మరియు ఎమోషనల్ అంశాలతో రూపొందిన ‘ఇరుముడి’ ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది.


