గెట్ రెడీ ఫర్ ‘కిక్ 2’ గ్రాండ్ ప్రమోషన్స్

గెట్ రెడీ ఫర్ ‘కిక్ 2’ గ్రాండ్ ప్రమోషన్స్

Published on Apr 16, 2015 9:29 AM IST

Kick2
మాస్ మహారాజ రవితేజ కెరీర్లో కమర్షియల్ గా పెద్ద హిట్ గా నిలిచిన సినిమా ‘కిక్’. రవితేజ బాడీ లాంగ్వెన్ కి, అతని ఎనర్జీ లెవల్స్ కి పర్ఫెక్ట్ గా సరిపోయే కిక్ పాత్రలో ఆడియన్స్ ని విపరీతంగా ఎంటర్టైన్ చేసాడు. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ తో అదే ఎనర్జీ లెవల్స్ తో, అదే ఎంటర్టైన్మెంట్ తో మన ముందుకు రానున్న సినిమా ‘కిక్ 2’. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ఇటీవలే స్విట్జర్ ల్యాండ్ లో సాంగ్స్ షూట్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా మరో కొద్ది రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకోనుంది.

ఇన్ని రోజులు సైలెంట్ గా షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్స్ ని త్వరలో ప్రారంభించనున్నారు. అది కూడా గ్రాండ్ గా ఉండేలా కళ్యాణ్ రామ్ అండ్ అతని టీం ప్లాన్ చేస్తున్నారు. మే 7 న సినిమాని రిలీజ్ చెయ్యనుండడంతో పబ్లిసిటీని మొదలు పెట్టి ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేలా ప్రమోషన్స్ చేయాలని ఈ చిత్ర టీం వ్యూహరచన చేస్తోంది.

రవితేజ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాని నందమూరి కళ్యాణ్ రామ్ ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. కిక్ సినిమాలనే ఈ సినిమాలో కూడా ఆద్యంతం ఎంటర్టైన్మెంట్ ఉంటూనే థ్రిల్ చేసే అంశాలు కూడా ఉంటాయని సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు