రవితేజ చేయబోయే రీమేక్ త్వరలోనే ప్రారంభం కానుంది !

రవితేజ చేయబోయే రీమేక్ త్వరలోనే ప్రారంభం కానుంది !

Published on Jul 17, 2018 1:52 PM IST

raviteja

మాస్ రాజారవితేజ ‘కందిరీగ’ ఫెమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శత్వంలో నటించనున్నారని తెలిసిందే. ‘తేరి ‘రీమేక్ గా తెరకెక్కనున్న ఈ చిత్రం ఆగిపోయిందని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే అవ్వని కేవలం రూమర్లేనని తెలుస్తుంది. ఎందుకంటె ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ లో ప్రారంభం కానుందని సమాచారం.

ప్రస్తుతం రవితేజ శ్రీను వైట్ల తెరక్కిస్తున్న’అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ని ఆగష్టు లో పూర్తి చేసి సెప్టెంబర్ నుండి ఆయన సంతోష్ శ్రీనివాస్ చిత్రాన్ని మొదలు పెట్టనున్నారు. ప్రముఖ చిత్రనిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు