రవితేజ కొత్త చిత్రం ఎప్పుడు ప్రారంభం కానుందంటే !

రవితేజ కొత్త చిత్రం ఎప్పుడు ప్రారంభం కానుందంటే !

Published on Sep 20, 2018 1:00 AM IST

మాస్ రాజా రవితేజ ప్రస్తుతం శ్రీను వైట్ల తెరకెక్కిస్తున్న ‘అమర్ అక్బర్ ఆంటొని’ చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈచిత్ర షూటింగ్ చివరిదశకు చేరుకుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈచిత్రం అక్టోబర్ 5న విడుదలకావాల్సి ఉండగా వాయిదా పడిందని సమాచారం. విడుదలకు మరో 15 రోజుల సమయమె మిగిలివున్న చిత్ర యూనిట్ ఎలాంటి ప్రమోషన్స్ చేయకపోవడం ఈ వార్తలను నిజం చేస్తున్నాయి.

ఇక ఈచిత్రం తరువాత రవితేజ ‘ఎక్కడికిపోతావు చిన్నవాడ’ ఫెమ్ వి ఐ ఆనంద్ దర్శకత్వంలో నటించనున్నాడని తెలిసిందే. ఈ చిత్రం డిసెంబర్ లో ప్రారంభం కానుందట. తమన్ సంగీతం అందిచనున్న ఈచిత్రంలో రవి తేజ డ్యూయెల్ రోల్లో నటించనున్నారు. ‘నేల టికెట్టు’ నిర్మాత రవి తాళ్లూరి ఈచిత్రాన్ని నిర్మించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు