ఇంటర్వ్యూ : రవిబాబు – ఆవిరి ఒక ఫ్యామిలీ థ్రిల్లర్ !

ఇంటర్వ్యూ : రవిబాబు – ఆవిరి ఒక ఫ్యామిలీ థ్రిల్లర్ !

Published on Oct 30, 2019 1:33 PM IST

వైవిధ్యమైన చిత్రాల దర్శకుడు రవిబాబు దర్శకత్వంలో అంతా కొత్తవారితో రాబోతున్న సినిమా ‘ఆవిరి’. సక్సెస్‌ఫుల్ నిర్మాత దిల్‌ రాజు ఈ సినిమాను నవంబర్ 1న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా రవిబాబు మీడియాతో మాట్లాడారు.

మీకు కలిసి వస్తోన్న హారర్ జోనర్ లోనే మళ్ళీ సినిమా చేస్తున్నారు ?

హారర్ జోనర్ అంటే.. ఒకే రకం సినిమాలు ఉండవు. చాల రకాల హారర్ సినిమాలు ఉంటాయి. అయినా ‘ఆవిరి’ హారర్ సినిమా కాదు, ఇది ఒక ఫ్యామిలీ థ్రిల్లర్. ఇంట్రస్టింగ్ స్టోరీతో థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా చేశాము.

 

ఫ్యామిలీ థ్రిల్లర్.చేయడానికి కారణం ?

ఒక కొత్త స్టోరీతో చెద్దామనుకుంటున్న టైంలో ఒక న్యూస్ చదివాను. కలెక్టర్ ఆమ్రపాలి వరంగల్ లో ఉంటున్నప్పుడు.. ఆమె ఇంట్లో ఏదో దెయ్యం ఉందనే రూమర్స్ వచ్చాయి. అవి చదివినప్పుడు నాకు ఈ సినిమా ఐడియా వచ్చింది.

 

దిల్ రాజుతో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?

నేను దిల్ రాజూ గారు ఎప్పటినుంచో పాత ఫ్రెండ్స్. అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం. ఎప్పుడు సినిమా చేద్దాం అనుకుంటూ ఉన్నాం, బట్ ఎందుకో కుదరలేదు. అయితే ఈ సినిమాకి మాత్రం అనుకోకుండా కుదిరింది. ఫస్ట్ కాపీ చూసి బాగుంది అని, ఆయనే రిలీజ్ చేస్తున్నారు.

 

అంటే ఈ సినిమా ప్రొడక్షన్ మీదేనా ?

నాదేనండి. నేను ఏ సినిమా చేసినా ప్రొడక్షన్ నాదే ఉంటుంది. ఫస్ట్ కాపీ చూసి ఏ నిర్మాత అయిన సినిమాని ప్రెజెంట్ చేస్తూ రిలీజ్ చేస్తారు. అయితే ఫస్ట్ కాపీ వరకే నా డ్యూటీ. ప్రమోషన్స్ అన్ని నిర్మాత చెప్పినట్లుగానే చేస్తాను.

 

‘అదిగో’ సినిమా ఫలితం నిరాశ పరిచిందా ?

నిరాశ పరిచేంతగా నేను దాని గురించే ఆలోచించను. కాకపోతే ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కే దాదాపు రెండున్నర సంవత్సరాల పట్టింది. అంత టైమ్ పెట్టి.. చివరికీ అది ఫెయిల్ అయితే ఖచ్చితంగా బాధ ఉంటుంది. బట్ ఆ సినిమా చేస్తోన్న క్రమంలో చాల నేర్చుకున్నాను.

 

ఈ సినిమాలో మీరు పెద్ద క్యారెక్టర్ లో యాక్ట్ చేస్తున్నారు ?

అది అనుకుని చేసింది కాదు. ముందు ఆ రోల్ లో చాలమందిని అనుకున్నాము. బట్ ఎవరూ సెట్ అవ్వలేదు.అప్పుడు రైటర్ సత్యానంద్ గారు నువ్వే చేయమని ఎంకరేజ్ చేశారు. అలా ఈ సినిమలో యాక్ట్ చేశాను.

 

ఐడియా అనుకున్నప్పుడు మీరు స్క్రిప్ట్ ను ఎన్ని రోజుల్లో రాస్తారు ?

ఇన్ని రోజులు అని ఏమి ఉండదు. ఐడియా అనుకున్నప్పుడు నుండి దాని గురించి ఆలోచిస్తూనే ఉంటాను. అలా ఆలోచించి.. ఫైనల్ గా ఒక రెండు మూడు గంటల్లో రఫ్ గా స్టోరీని రాసేస్తాను.

 

మీ తదుపరి సినిమాలు గురించి ?

ప్రస్తుతం ఆవిరి రిలీజ్ కోసమే వెయిట్ చేస్తున్నాను. ఈ సినిమా రిలీజ్ తరువాతే తదుపరి సినిమా గురించి ఆలోచిస్తాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు