“ఖిలాడి” గ్లింప్స్.. రవితేజ బర్త్ డే గిఫ్ట్ అదిరిందే..!

Published on Jan 26, 2021 11:01 am IST

మొదటగా టాలీవుడ్ మోస్ట్ లవబుల్ హీరో మాస్ మహారాజ్ రవితేజకు జన్మదిన శుభాకాంక్షలు. స్వయంకృషితో ఇక్కడ వరకు వచ్చిన మాస్ మహారాజ్ ఈ కొత్త ఏడాది “క్రాక్” తో సాలిడ్ కం బ్యాక్ ఇచ్చి ప్యాండమిక్ టైం లో కూడా భారీ వసూళ్లను కొల్లగొట్టి రవితేజకు సాలిడ్ హిట్ పడితే ఎలా ఉంటుందో ప్రూవ్ చేసింది. మరి అలాగే మాస్ మహారాజ్ రవితేజ ఎనర్జీ అండ్ స్పీడ్ తెలిసిందే.

అలా దర్శకుడు రమేష్ వర్మ తో స్టార్ట్ చేసిన చిత్రం “ఖిలాడి” డబుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్లాన్ చేసిన ఈ చిత్రం నుంచి నేడు రవితేజ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఖిలాడీ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఒక ఫైట్ సీక్వెన్స్ నుంచి స్టైలిష్ అండ్ కూల్ గా రాడ్ పట్టుకొని నడుస్తూ ఉన్న రవితేజ వీడియోను విడుదల చేశారు.

మరి అలాగే దేవిశ్రీ ప్రసాద్ మార్క్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఈ గ్లింప్స్ మాస్ మహారాజ్ ఫ్యాన్స్ కు పర్ఫెక్ట్ గిఫ్ట్ గా అనిపిస్తుంది. మరి ఈ సినిమాలో రాబితేజ డ్యూయల్ రోల్స్ లో కనిపించనున్న సంగతి తెలిసిందే. అలాగే పెన్ స్టూడియోస్ మరియు కోనేరు సత్యన్నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేసి వేసవి కానుకగా విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.

టీఆర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :

More