కుర్ర హీరోయిన్‌తో జతకట్టబోతున్న మాస్ మహారాజ్..!

Published on Sep 24, 2021 3:00 am IST

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం తెలుగులో త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నటించేందుకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అయితే ఈ చిత్రంలో రవితేజ సరసన కన్నడ బ్యూటిఫుల్ హీరోయిన్ అయిన శ్రీ లీలని తీసుకున్నట్టు తెలుస్తుంది.

అయితే ప్రస్తుతం నూతన దర్శకురాలు గౌరీ రోణంకి దర్శకత్వం వహిస్తున్న పెళ్లి సందడ్ చిత్రంలో శ్రీ లీల హీరోయిన్‌గా నటిస్తుంది. అయితే రవితేజతో జోడీ కట్టేందుకు ఈ ముద్దుగుమ్మ 50 లక్షల రూపాయల నుంచి 75 లక్షల రూపాయల రెమ్యునరెషన్ చార్జ్ చేసినట్టు చెప్పుకొంటున్నారు. ఇదిలా ఉంటే రవితేజ ప్రస్తుతం “ఖిలాడీ, “రామారావు ఆన్ డ్యూటీ” సినిమాల షూటింగ్‌లో ఉన్నాడు.

సంబంధిత సమాచారం :