స్పెషల్ డే నాడు మాస్ రాజా కొత్త సినిమా ప్రకటన !

Published on Jan 24, 2019 12:32 pm IST


‘అమర్ అక్బర్ ఆంటొని’ పరాజయం మాస్ మహారాజ్ రవితేజ ని ఆలోచనలో పడేసింది. దాంతో తన కొత్త చిత్రాన్ని చాలా జాగ్రతగా ప్లాన్ చేసుంటున్నాడు. ఈ చిత్రం తరువాత రవితేజ వి ఐ ఆనంద్ దర్శకత్వంలో నటించనున్నాడని తెలిసిందే. ఈ చిత్రం డిసెంబర్ లోనే లాంచ్ కావాల్సింది కానీ రవితేజ స్క్రిప్ట్ విషయంలో కాంప్రమైజ్ కాకపోవడంతో ఆలస్యం అవుతూ వచ్చింది. ఇక తాజాగా రవితేజ పుట్టిన రోజు సందర్భంగా జనవరి 26న ఈచిత్రం యొక్క టైటిల్ లోగో ను మరియు ఫస్ట్ లుక్ ను లాంచ్ చేయనున్నారు.

సై -ఫై థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో నాబా నటేష్ , పాయల్ రాజ్ పుత్ కథానాయికలుగా నటించనున్నారు. తమన్ సంగీతం అందించనున్న ఈచిత్రాన్ని రామ్ తాళ్లూరి నిర్మించనున్నారు. ఇక అదే రోజు ‘కందిరీగ’ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ తో రవితేజ చేయనున్న సినిమా ఫై ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈచిత్రం కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘తెరి’ కి రీమేక్ గా తెరకెక్కనుంది. అయితే తెలుగు నేటివిటీకి తగ్గట్లు స్క్రిప్ట్ లో చాలా మార్పులు చేశాడట సంతోష్ శ్రీనివాస్.

సంబంధిత సమాచారం :