మాస్ మహారాజ్ “ఖిలాడి” స్ట్రీమింగ్ హక్కులు వారికే.?

Published on May 14, 2021 1:30 pm IST

ఈ ఏడాది మాస్ మహారాజ్ రవితేజ తన “క్రాక్” చిత్రంతో సాలిడ్ మాస్ హిట్ ను కొట్టి సరికొత్త ఎనర్జీ ఇచ్చారు. మరి అదే సినిమా హిట్ ఊపులో మాస్ మహారాజ్ స్టార్ట్ చేసిన మరో ఇంట్రెస్టింగ్ మాస్ యాక్షన్ థ్రిల్లర్ “ఖిలాడి”. దీనిపై కూడా మంచి అంచనాలు సెట్టయిన సంగతి తెలిసిందే.

అలాగే ఇదే మే నెలలో విడుదలను మేకర్స్ ను ప్లాన్ చేశారు కానీ ఊహించని విధంగా కోవిడ్ సెకండ్ వేవ్ పెరగడంతో మేకర్స్ ఈ చిత్రాన్ని వాయిదా వేశారు. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రం తాలూకా స్ట్రీమింగ్ హక్కులపై టాక్ బయటకొచ్చింది. ఈ చిత్రం తాలూకా స్ట్రీమింగ్ హక్కులను దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వారు సొంతం చేసుకున్నట్టు టాక్ వినిపిస్తుంది.

మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్స్ చేస్తుండగా డింపుల్ హయాతి మరియు మీనాక్షి చౌదరిలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి దేవిశ్రీ సంగీతం అందిస్తుండగా రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :