“ఖిలాడి” టీజర్..థ్రిల్లింగ్ అండ్ పర్ఫెక్ట్ మాస్.!

Published on Apr 12, 2021 10:12 am IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన లాస్ట్ చిత్రం “క్రాక్” తో సాలిడ్ కం బ్యాక్ అందుకున్న సంగతి తెలిసిందే. మరి అలాగే ఇది ఊపులో దర్శకుడు రమేష్ వర్మతో అప్పటి నుంచో లైన్ లో ఉన్న చిత్రం “ఖిలాడి”ను లైన్ లోకి తెచ్చేసారు. జెట్ స్పీడ్ తో పూర్తి చేస్తున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ నేడు ఉగాది సందర్భంగా విడుదల చేస్తామని చెప్పి టైం కి విడుదల చేశారు. మాంచి అంచనాలు సెట్ చేసుకున్న ఈ టీజర్ కట్ మాత్రం ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉందని చెప్పాలి.

ముఖ్యంగా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎలాంటి డైలాగ్స్ లేకుండా జస్ట్ విజువల్స్ మరియు దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో చాలా థ్రిల్లింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. అలాగే ప్రముఖ నటుడు అర్జున్ ఇందులో కీలకంగా కనిపిస్తున్నారు. అలాగే రవితేజ చేస్తున్న డ్యూయల్ రోల్స్ లో ఒకటి గ్యాంగ్స్టర్ అన్నట్టు అనిపిస్తుంది. అంతే కాకుండా తన రోల్ లో ఒకటి సుత్తి పట్టుకుని కొంతమందిని హంట్ చెయ్యడం, మరికొన్ని మాస్ విజువల్స్ మరింత ఆసక్తి రేపుతున్నాయి.

అలాగే ఈ టీజర్ లో జి కె విష్ణు సినిమాటోగ్రఫీ కూడా మరోసారి మంచి ఇంటెన్స్ గా కనిపిస్తుంది. ఇక చివర్లో తాను చేస్తున్న మర్డర్స్ పైనో ఏమో కానీ ఎలాంటి ఎమోషన్స్ పెట్టుకోకూడదని పేల్చిన ఒకే ఒక్క డైలాగ్ హైలైట్ అయ్యింది. మొత్తానికి మాత్రం ఈ టీజర్ కట్ ఖిలాడి పై మరిన్ని అంచనాలు పెంచింది అని చెప్పాలి. పెన్ స్టూడియోస్ మరియు ఏ స్టూడియోస్ వారు నిర్మాణం వహిస్తున్న ఈ చిత్రం ఎలా ఉంటుందో తెలియాలి అంటే వచ్చే మే 28న విడుదల వరకు వేచి చూడాల్సిందే.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :