డిస్కో రాజాకి విలన్ రోల్స్ చేయాలని ఉందట

Published on Jan 17, 2020 3:00 am IST

మాస్ మహారాజ్ రవితేజ విలన్ రోల్స్ చేయాలని అనుకుంటున్నాడట. ఎవరైన పూర్తి స్థాయి వైవిధ్యమైన విలన్ రోల్ ఇస్తే నటించడానికి రెడీగా ఉన్నాడట. ఈ విషయాన్ని స్వయంగా రవితేజ ఓ కార్యక్రమంలో చెప్పుకొచ్చారు. ఆయన నటించిన తాజా చిత్రం డిస్కో రాజా ఈనెల 24న విడుదల కానుంది. ఈ సంధర్భంగా చిత్ర యూనిట్ ప్రొమోషన్స్ లో పాల్గొంటున్నారు. రవితేజ, దర్శకుడు వి ఐ ఆనంద్, నటుడు బాబీ సింహ ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. దర్శకుడు వి ఐ ఆనంద్ రవితేజను ప్రస్తుత ట్రెండ్ ప్రకారం ఏ జోనర్ చిత్రాలలో నటించడానికి ఇష్టపడతారు అని అడుగగా , గతంలో నేను కమర్షియల్ సినిమాలు చేయడానికి ఇష్టపడే వాడిని, అందుకే కిక్, విక్రమార్కుడు వంటి చిత్రాలలో నటించి, సూపర్ హిట్స్ అందుకున్నాను. అదే సమయంలో నా ఆటోగ్రాఫ్, శంభో శివ శంభో వంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలలో నటించాను. ఆ చిత్రాలు నాకు ఎంతో ఇష్టం కానీ, అవి ఆడలేదు.

కానీ ఇప్పుడు ప్రేక్షకుల మైండ్ సెట్ పూర్తిగా మారిపోయింది. సినిమాలో కొత్తదనం, కొత్త కాన్సెప్ట్ లేకపోతే చూడటం లేదు. పాత్ర భిన్నంగా ఉంటే విలన్ పాత్రలు చేయడానికైనా నేను సిద్ధం అన్నారు. రవితేజ కెరీర్ ప్రారంభంలో అనేక సినిమాలలో చిన్నాచితకా విలన్ రోల్స్ చేశాడు. డిస్కో రాజా మూవీ ఎస్ ఆర్ టి క్రియేషన్స్ పతాకంపై రామ్ తళ్లూరి నిర్మిస్తున్నారు. నభా నటేష్, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More