ఆ సీన్ కు నో చెప్పిన రవితేజ.?

Published on Jan 21, 2021 1:00 pm IST

ఈ సంక్రాంతికి తెలుగు ఆడియెన్స్ కు మాస్ బిర్యానీ పెట్టి “క్రాక్” తో అదిరిపోయే కం బ్యాక్ ను అందుకున్న మాస్ మహారాజ్ మళ్ళీ ట్రాక్ లోకి వచ్చేసారు. తన ప్రతీ సినిమాకు కూడా రెట్టింపు ఎనర్జీతో అదరగొట్టే రవితేజ ఈ సినిమా ఇంకా విడుదల కాకముందే మొదలు పెట్టేసిన మరో చిత్రం “ఖిలాడి”.

దర్శకుడు రవివర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూట్ ఇప్పుడు శరవేగంగా పూర్తి అవుతుంది. అయితే ఇదిలా ఉండగా పక్కా సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ ఓ సీన్ కు నో చెప్పినట్టుగా తెలుస్తుంది. ఈ కథ ప్రకారం ఓ సన్నివేశంలో లిప్ లాక్ డిమాండ్ చేసిందట కానీ మాస్ మహారాజ్ మాత్రం అందుకు నో చెప్పారట.

తాను అలాంటి సీన్స్ చెయ్యనని సినిమా క్లీన్ గా ఉండాలని చెప్పారట. ఇక ఈ చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్స్ చేస్తుండగా మీనాక్షి చౌదరి మరియు డింపుల్ హయాతిలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మరి అలాగే ఏ ఎస్ స్టూడియోస్, పెన్ మూవీస్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More