రవితేజ, శ్రీను వైట్ల సినిమా షూటింగ్ వివరాలు !

కామెడి సినిమాలు తియ్యడంలో తనకంటూ ఒక మార్క్ సంపాదించుకున్న దర్శకుల్లో శ్రీనువైట్ల ఒకరు. ఈమధ్య ఆయన తీసిన సినిమాలు పెద్దగా సక్సెస్ కానప్పటికీ ఈసారి రవితేజ తో అమర్ అక్భర్ అంథోని సినిమాను తెరకెక్కించబోతునాడు. ఈ సినిమా షూటింగ్ ఈ నెల 19 న అమెరికా లో ప్రారంభం కానుంది. రవితేజ ఏప్రిల్ నుండి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు.

తమన్ సంగీతం అందించబోతున్న ఈ సినిమా ఏప్రిల్ నుండి ప్రారంభం కాబోతోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోతున్న ఈ మూవీ లో ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఎక్కువ భాగం షూటింగ్ అమెరికా లో జరగనుంది. ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నేల టికెట్ సినిమాలో నటిస్తున్నాడు రవితేజ. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వైజాగ్ లో జరుగుతోంది.