డబుల్ ‘ధమాకా’కు రెడీ అవుతున్న రవితేజ..?

డబుల్ ‘ధమాకా’కు రెడీ అవుతున్న రవితేజ..?

Published on Jun 20, 2026 6:00 PM IST

మాస్ మహారాజా రవితేజ తన తాజా చిత్రం ‘ఇరుముడి’ షూటింగ్‌ను దాదాపు పూర్తి చేసి, లైన్ లో మరో రెండు ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లను సిద్ధం చేస్తున్నాడు. ‘రాజా ది గ్రేట్’ చిత్రం తర్వాత రవితేజ, నిర్మాత దిల్ రాజు కాంబినేషన్ మళ్లీ రిపీట్ కానుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై హసిత్ గోలి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సరికొత్త చిత్రం ఈ ఏడాది ఆగస్టులోనే పట్టాలెక్కడానికి సిద్ధంగా ఉంది.

దీంతో పాటే మరో క్రేజీ కాంబినేషన్ అక్టోబర్‌లో ప్రారంభం కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఒక మాస్ ఎంటర్‌టైనర్ చేయడానికి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నిజానికి ఈ స్క్రిప్ట్ మొదట మరో స్టార్ హీరోతో ప్లాన్ చేసినప్పటికీ, డేట్స్ కుదరకపోవడంతో వివేక్ ఆత్రేయ ఈ కథను రవితేజకు వినిపించడం, ఆయనకు వెంటనే నచ్చడంతో ప్రాజెక్ట్ ఓకే అయిపోయింది.

ఇక్కడ విశేషం ఏంటంటే.. రవితేజ ఈ రెండు సినిమాలను ఒకేసారి షూట్ చేయనున్నాడట. రెండు చిత్రాలు అనుకున్న సమయానికి వేగంగా పూర్తి కావాలనే ప్లానింగ్‌తో ఆయన తన డేట్స్‌ను అడ్జస్ట్ చేస్తున్నాడు. టాప్ నిర్మాతలు, టాలెంటెడ్ డైరెక్టర్స్ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ రెండు చిత్రాలను శరవేగంగా పూర్తి చేసి 2027లో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

తాజా వార్తలు