రవితేజ ట్రాక్ రికార్డ్: ఈ సంక్రాంతి మాస్ మహారాజ్ కి కలిసొస్తుందా!

రవితేజ ట్రాక్ రికార్డ్: ఈ సంక్రాంతి మాస్ మహారాజ్ కి కలిసొస్తుందా!

Published on Jan 12, 2026 12:45 AM IST

Untitled 1 1

మన టాలీవుడ్ నుంచి ఈ సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో రిలీజ్ కి వస్తున్న పలు అవైటెడ్ చిత్రాల్లో మాస్ మహారాజ రవితేజ హీరోగా దర్శకుడు కిషోర్ తిరుమల కాంబినేషన్ లో చేసిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం “భర్త మహాశయులకు విజ్ఞప్తి” కూడా ఒకటి. ఆషిక రంగనాథ్ అలాగే డింపుల్ హయాతి హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా మంచి ప్రమోషన్స్ కూడా చేస్తూ వచ్చింది.

అయితే రవితేజకి సంక్రాంతి బరిలో మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇది వరకు వచ్చిన సినిమాల్లో తక్కువ ఫెయిల్యూర్స్ మాత్రమే కనిపిస్తాయి. ఈ మధ్య కాలంలోనే అయితే వాల్తేరు వీరయ్య, క్రాక్ లాంటి భారీ హిట్స్ తన ప్రెజెన్స్ తో ఉన్నాయి. సో ఇలానే మళ్ళీ సంక్రాంతి సెంటిమెంట్ భర్త మహాశయులకు కూడా కలిసి రావాలని అభిమానులు భావిస్తున్నారు.

అంతే కాకుండా దర్శకుడు హరీష్ శంకర్ కూడా భావిస్తున్నారు. మరి వీరి కలయికలో వచ్చిన మిరపకాయ్ చిత్రం కూడా సంక్రాంతి బరిలోనే వచ్చి క్రేజీ వసూళ్లు సాధించింది. సో ఈసారి సంక్రాంతి రవితేజకి కలిసొస్తుందా లేదా అనేది ఈ 13 వరకు ఆగితే తెలిసిపోతుంది.

తాజా వార్తలు