ఈ సినిమాకు కూడా లేట్ చెయ్యని మాస్ మహారాజ్.?

ఈ సినిమాకు కూడా లేట్ చెయ్యని మాస్ మహారాజ్.?

Published on Jan 19, 2021 6:00 PM IST

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “క్రాక్”. తన హిట్ దర్శకుడు గోపీచంద్ మలినేనితో హ్యాట్రిక్ చిత్రంగా ప్లాన్ చేసిన ఈ పక్కా మాస్ ఎంటర్టైనర్ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల చేసి సాలిడ్ కం బ్యాక్ ను అందుకున్నారు. అయితే ఈ చిత్రం ఇప్పటికే భారీ లాభాలను తెచ్చిపెట్టి అదిరిపోయే హిట్ గా నిలిచింది.

మరి ఇది ఇంకా లైన్ లో ఉండగానే “ఖిలాడి” అనే మరో ఇంట్రెస్టింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ ను టేకప్ చేసారు. మరి ఇదిలా ఉండగా “క్రాక్” సీక్వెల్ పై కూడా లేటెస్ట్ టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రాన్ని కూడా స్టార్ట్ చెయ్యడానికి మాస్ మహారాజ్ పెద్దగా సమయం తీసుకోరని తెలుస్తుంది.

మరి ఈ చిత్రం ఎప్పుడు మొదలవుతుందో కానీ ఇలాంటో ప్యాండమిక్ టైం లో కూడా భారీ లాభాలను తెచ్చిపెట్టిన ఈ చిత్రానికి సీక్వెల్ వస్తే అదే రేంజ్ హిట్ అవుతుందో చూడాలి. మరి ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా ఠాగూర్ మధు నిర్మాణం వహించారు. అలాగే ఈ సినిమా రీమేక్ కు కూడా భారీ డిమాండ్ ఇప్పుడు ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు