ఈ సంక్రాతి విజేత రవితేజ

Published on Jan 19, 2021 12:50 am IST

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజ రవితేజ నటించిన ‘క్రాక్’ చిత్రం థియేటర్లలో సత్తా చూపిస్తోంది. లాక్ డౌన్ అనంతరం వచ్చిన పెద్ద చిత్రం కావడంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. మొదటి రోజు నుండి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఆ తర్వాతి రోజుల్లో కూడ బాగానే పెర్ఫార్మ్ చేసింది. వరుసగా ‘మాస్టర్,రెడ్, అల్లుడి అదుర్స్’ చిత్రాలు రిలీజైనప్పటికీ ఎక్కడా వసూళ్లు డ్రాప్ కబనడలేదు.

తొలిరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 10.5 కోట్ల గ్రాస్, 6.25 కోట్ల షేర్ వసూలు చేసిన ఈ చిత్రం ఇప్పటికే బ్రేక్ ఈవెన్ సాధించేసింది. ట్రేడ్ వర్గాల లెక్కల మేరకు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.17.5 కోట్లు కాగా మొదటి 8 రోజులకు ప్రపంచవ్యాప్తంగా రూ.25 కోట్ల వరకు షేర్ ఖాతాలో వేసుకున్నట్టు తెలుస్తోంది. అంటే ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లు మంచి లాభాలను చూశారు. ఈ జోరు ఇంకో వారం రోజులు కొనసాగితే క్లీన్ బ్లాక్ బస్టర్ హిట్ రవితేజ ఖాతాలో పడ్డట్టే. మొత్తం మీద ఈ సంక్రాంతి రేసులో రవితేజ్ విజేతగా నిలిచాడన్నమాట.

సంబంధిత సమాచారం :