పూర్తిగా అమెరికాలోనే షూటింగ్ జరుపుకోనున్న రవితేజ చిత్రం !
Published on Mar 8, 2018 4:52 pm IST

‘నీకోసం, వెంకీ, దుబాయ్ శీను’ వంటి విజయవంతమైన చిత్రాల తరవాత రవితేజ, శ్రీనువైట్లలు కలిసి ‘అమర్ అక్బర్ ఆంటోని’ అనే సినిమా చేయనున్నారు. ఈరోజే ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఈ సినిమాలోని విశేషమేమిటంటే చిత్రీకరణ మొత్తం అమెరికాలోనే జరుగుతుందట. కేవలం కొద్దిగా మాత్రమే ఇండియాలో జరుగుతుందట.

అమెరికాలోని న్యూయార్క్, డెట్రాయిట్, సాల్ట్ లేక్ సిటీ, ఇంకా కొన్ని అందమైన లొకేషన్లలో ఈ షూట్ జరగనుంది. ఇందుకోసం నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ మంచి బడ్జెట్ ను కేటాయించిదట. ఇక ఈ చిత్రంలో రవితేజ కుమారుడు మహాదన్, నటి లయ కుమార్తె శ్లోక నటించనున్నారు. నవీన్ యార్నేని, రవి శంకర్, మోహన్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో స్టార్ నటుడు సునీల్ ఒక ఫుల్ లెంగ్త్ రోల్ చేయనుండగా అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది.

 
Like us on Facebook