రవితేజ “టైగర్ నాగేశ్వరరావు” మూవీ లేటెస్ట్ అప్డేట్!

Published on Jan 12, 2023 6:00 pm IST


మాస్ మహారాజా రవితేజ ధమాకాతో భారీ బ్లాక్‌ బస్టర్‌ని సాధించాడు, 2022ని అత్యంత గొప్పగా ముగించాడు. తన రాబోయే చిత్రాలలో, టైగర్ నాగేశ్వరరావు విభిన్నమైన చిత్రం. ఈ చిత్రం పై మంచి హైప్ వచ్చింది. ఇది పాన్ ఇండియన్ ప్రాజెక్ట్, వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌తో కూడిన షెడ్యూల్‌ను ముగించినట్లు మేకర్స్ తాజాగా వెల్లడించారు.

షూటింగ్ అప్‌డేట్స్‌తో మేకర్స్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్నారు. టైగర్ నాగేశ్వరరావు చిత్రం పేరు మోసిన దొంగపై బయోపిక్. స్టువర్ట్‌పురం అనే గ్రామంలో 70 లలో జరిగే కథ ఇది. రవితేజ సరసన నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :