రణ్వీర్ ‘గల్లీ బాయ్’ కి పాజిటివ్ రివ్యూస్ !

రణ్వీర్ ‘గల్లీ బాయ్’ కి పాజిటివ్ రివ్యూస్ !

Published on Feb 15, 2019 2:12 AM IST

ఇటీవల సింబా తో బ్లాక్ బ్లాస్టర్ హిట్ కొట్టాడు బాలీవుడ్ యువ హీరో రణ్వీర్ సింగ్. తెలుగు సూపర్ హిట్ మూవీ టెంపర్ కు రీమేక్ గా తెరకెక్కిన ఈచిత్రం సుమారు 300 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇక ఈచిత్రం తరువాత రణ్వీర్ ‘గల్లీ బాయ్’ అనే చిత్రం తో ప్రేక్షకులముందుకు వచ్చాడు. ఈ రోజు విడుదలైన ఈ చిత్రం క్రిటిక్స్ నుండి పాజిటివ్ రివ్యూస్ ను రాబట్టుకుంది.

రణ్వీర్ , అలియా బట్ నటన అలాగే డైరెక్షన్ ఈ చిత్రానికి హెలైట్స్ అయ్యాయట. మ్యూజికల్ డ్రామా నేపథ్యంలో జోయా అక్తర్ తెరకెక్కించిన ఈ చిత్రానికి శంకర్-ఎహసాన్-లాయ్ సంగీతం అందించారు. ఇక ఈ చిత్రం తో బ్యాక్ టు బ్యాక్ విజయాలను సొంతం చేసుకున్నాడు రణ్వీర్ సింగ్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు