‘ఆర్ఆర్ఆర్’లో విలన్స్ వీళ్ళే !

Published on Nov 20, 2019 5:40 pm IST

ఎన్టీఆర్ – చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. కాగా ఈ సినిమా ఇప్పటికే 70% షూట్ పూర్తి చేసుకుంది. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ బ్యూటీ ‘ఒలివియా మోరిస్’ నటించనుందని చిత్రబృందం ప్రకటించింది. అలాగే విల‌న్స్ గురించి చిత్ర యూనిట్ అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌రిచింది. ఈ సినిమాలో అలిసన్ డూడీ, రే స్టీవెన్ స‌న్ మెయిన్ విల‌న్స్‌ గా న‌టిస్తున్నారు. ఎ వ్యూ టు కిల్‌, ఇండియానా జోన్స్‌ వంటి సినిమాల్లో ఐరిష్ న‌టి అలిస‌న్ డూడీ న‌టించారు. అలాగే థోర్‌, కింగ్ అర్థ‌ర్‌ స‌హా ప‌లు పాపుల‌ర్ టీవీ షోస్‌లో రే స్టీవెన్ స‌న్ న‌టించారు.

ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ధృడంగా ఉండే కొమరం భీం పాత్రలో కనిపించేందుకు ఎన్టీఆర్ లాయిడ్ స్టీవెన్స్‌ పర్యవేక్షణలో కఠినమైన కసరత్తులు కూడా చేశాడు. ఇక ఈ సినిమాలో ఇతర ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు. జులై 30, 2020 లో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More