‘రాయలసీమ లవ్ స్టోరీ’ మోషన్ పోస్టర్ విడుదల చేసిన డైరెక్టర్ జి . నాగేశ్వర్ రెడ్డి !

‘రాయలసీమ లవ్ స్టోరీ’ మోషన్ పోస్టర్ విడుదల చేసిన డైరెక్టర్ జి . నాగేశ్వర్ రెడ్డి !

Published on Nov 5, 2018 7:00 AM IST

RLS

వెంకట్ , హృశాలి గోసవి జంటగా ఏ వన్ ఎంటర్ టైన్ మెంట్స్ మూవీస్ పతాకంపై నూతన దర్శలకుడు రామ్ రణధీర్రూపొందించిన చిత్రం ‘రాయలసీమ లవ్ స్టోరీ’. పంచ లింగాల బ్రదర్స్ రాయల్ చిన్నా – నాగరాజు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగినీడు , నల్లవేణు , పృథ్వీ , జీవా , తాగుబోతు రమేష్ , అదుర్స్ రఘు , గెటప్ శ్రీను , మధుమణి ,మిర్చి మాధవి ,జబర్దస్త్ కొమరం ,రాజమౌళి , సన్నీ , భద్రం , ప్రసన్న కుమార్ తదితరులు నటించిన ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని , మోషన్ పోస్టర్ ని దర్శకులు జి . నాగేశ్వర్ రెడ్డి రిలీజ్ చేసి చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు అందజేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫస్ట్ లుక్ , మోషన్ పోస్టర్ లతోనే అంచనాలు పెరిగేలా చేసిన యూనిట్ ని అభినందిస్తున్నాను అలాగే సినిమా మంచి విజయం సాధించాలని అందరికీ మంచి పేరు రావాలని ఆశిస్తున్నామన్నారు .

దర్శకులు రామ్ రణధీర్ మాట్లాడుతూ నాపై పూర్తి నమ్మకంతో ఈ చిత్రానికి పెట్టుబడి పెట్టారు నిర్మాతలు , వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అద్భుతమైన ఔట్ ఫుట్ వచ్చింది ,నాకు ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన నిర్మాతలకు నా కృతఙ్ఞతలు. చిత్ర నిర్మాతలు రాయల్ చిన్నా – నాగరాజు లు మాట్లాడుతూ రామ్ రణధీర్ చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా నిర్మించడానికి ముందుకు వచ్చాం . సినిమా రష్ చూసుకున్నాం చాలా బాగా వచ్చింది . నాగేశ్వర్ రెడ్డి గారి చేతుల మీదుగా మా సినిమా మోషన్ పోస్టర్ ,ఫస్ట్ లుక్ రిలీజ్ కావడం మాకు మరింత సంతోషాన్ని ఇస్తోంది . పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు అన్నీ పూర్తయ్యాయి . త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి డిసెంబర్ లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు