​ఆకట్టుకుంటున్న ‘రాయవలస’ ఫస్ట్ లుక్.. హీరోగా కార్తీక్ జయంతి ఎంట్రీ

​ఆకట్టుకుంటున్న ‘రాయవలస’ ఫస్ట్ లుక్.. హీరోగా కార్తీక్ జయంతి ఎంట్రీ

Published on Apr 4, 2026 6:00 AM IST

ra

రేసన్ (RAYSUN) ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీకృష్ణ నిర్మాణంలో తెరకెక్కుతున్న “రాయవలస” చిత్ర ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అవార్డు విజేత, ఎన్‌ఆర్‌ఐ మహిళా దర్శకురాలు రాధిక జయంతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సింగర్, రైటర్, డ్యాన్సర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అమెరికా యువకుడు కార్తీక్ జయంతి ఈ సినిమా ద్వారా ‘నవ యువ కథానాయకుడు’గా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. అతనికి జోడీగా శ్రీషా నూలు నటిస్తున్నారు.

​గ్రామీణ వాతావరణం, నిజ జీవిత సంఘటనల ఆధారంగా రాఖీ అందించిన కథతో ఈ సినిమా రూపొందుతోంది. ఒక రైస్ మిల్ యజమాని రాజు జీవితంలోకి హీరోయిన్ ప్రవేశించాక జరిగే నాటకీయ పరిణామాల చుట్టూ ఈ కథ సాగుతుంది. “లవ్ టైడ్ బై ఫేట్” (Love Tied by Fate) అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ చిత్రం, యాక్షన్, ఎమోషన్, సంగీతం కలగలిపిన కంప్లీట్ ఎంటర్‌టైనర్‌గా అలరించనుంది. పక్కా ప్రణాళికతో సింగిల్ షెడ్యూల్‌లోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడం విశేషం.

​అన్నపూర్ణమ్మ, అనిత చౌదరి, జయప్రకాశ్, రవివర్మ, కాశీ విశ్వనాథ్ వంటి సీనియర్ నటులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. కెనడాకు చెందిన అర్జున్ బాలా అద్భుతమైన సంగీతం, కిట్టు సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి బలం చేకూరుస్తున్నాయి. కాలేజీ విద్యార్థుల సమక్షంలో లాంచ్ అయిన హీరో ఇంటెన్స్ ఫస్ట్ లుక్, సినిమాపై పాజిటివ్ అంచనాలను పెంచుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు