అజర్ బైజాన్ నుండి ప్యాకప్ చెప్పనున్న ఆర్ సి 12 టీం !

Published on Sep 26, 2018 12:19 am IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న 12వ చిత్ర షూటింగ్ యూరప్ లోని అజర్ బైజాన్ లో జరుగుతున్న విషయం తెలిసిందే. సుమారు 20 రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ఈ షెడ్యూల్ ముగించుకోనుంది. మరో నాలుగు రోజుల్లో ఈచిత్ర టీం షూటింగ్ పూర్తి చేసుకొని హైదరాబాద్ కు చేరుకోనుంది. ఈ షెడ్యూల్ లో స్టంట్ మాస్టర్ కనల్ కణ్ణన్ నేతృత్వంలో హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ ఎపిసోడ్ సినిమాకు హైలైట్ గా నిలువనుందట.

బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో భరత్ అనే నేను పేమ్ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుంది. బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో ప్రశాంత్, ఆర్యన్ రాజేష్, స్నేహ లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దానయ్య డి వి వి నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

X
More