ఆర్ సి12 ఫస్ట్ లుక్ ఆరోజే !

Published on Sep 24, 2018 4:06 pm IST


‘రంగస్థలం’ సినిమా తరువాత మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన 12వ చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈచిత్ర షూటింగ్ యూరప్ లోని అజర్ బైజాన్ అనే ప్రదేశంలో జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో హైవోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. హీరో రామ్ చరణ్ తోపాటు ప్రతినాయకుడు వివేక్ ఒబెరాయ్ అలాగే ఇతర తారాగణం ఫై ఈ దృశ్యాలను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈచిత్రం యొక్క ఫస్ట్ లుక్ ను దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదలచేయనున్నారని సమాచారం.

యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రంలో సీనియర్ హీరో ప్రశాంత్ తో పాటు ఆర్యన్ రాజేష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు . ఈచిత్రంలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్న ఈచిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కి విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :