రామ్ చరణ్ బోయపాటి సినిమా గురించి లేటెస్ట్ అప్ డేట్ !

రామ్ చరణ్ బోయపాటి సినిమా గురించి లేటెస్ట్ అప్ డేట్ !

Published on Aug 28, 2018 7:41 PM IST


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం శరవేగంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం రామ్ చరణ్ కెరీర్ లోనే ఓ మంచి యాక్షన్ ఎంటర్ టైనర్ గా నిలిచిపోనుందట. బోయపాటి సినిమాల శైలిలోనే ఈ సినిమా కూడా పక్కా మాస్ మసాలా అంశాలతో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నేలా బోయపాటి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ చిత్రంలో ఒకప్పటి హీరో ఆర్యన్ రాజేష్ చాలా సంవత్సరాల తర్వాత ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఆర్యన్ రాజేష్ క్యారెక్టర్ కి, రామ్ చరణ్ క్యారెక్టర్ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా నచ్చుతాయట. సినిమాలో చరణ్ కోసం ఆర్యన్ రాజేష్ ప్రాణాలు కోల్పోతాడని ఆ సందర్భంలో వచ్చే సన్నివేశాలు హృదయానికి హత్తుకున్నేలా ఉంటాయని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన ‘భరత్ అనే నేను’ ఫెమ్ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా సీనియర్ హీరో, హీరోయిన్లు ప్రశాంత్ మరియు స్నేహ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు