చరణ్ – శంకర్ కొత్త షెడ్యూల్ ఎప్పుడంటే?

చరణ్ – శంకర్ కొత్త షెడ్యూల్ ఎప్పుడంటే?

Published on Feb 7, 2023 9:00 AM IST

క్రేజీ డైరెక్టర్ శంకర్ – మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’ కాంబినేషన్ లో రాబోతున్న పాన్ ఇండియా సినిమా నుంచి ఒక క్రేజీ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమా తర్వాత షెడ్యూల్ ఈ నెల 9వ తేదీ నుంచి స్టార్ట్ కానుంది. 9న నుంచి హైదరాబాద్ లో పాటను చిత్రీకరించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీ లో షూటింగ్ జరగనుందని తెలుస్తోంది. ఈ సినిమా పీరియాడిక్ పొలిటికల్ డ్రామా. ఐతే ఈ సినిమాలో ఓ విప్లవ నాయకుడి పాత్ర ఉందని, ఈ పాత్ర చరణ్ పాత్రకు గురువు పాత్ర అని.. పోరాటం ద్వారానే దేశంలో అవినీతిని తరిమి కొట్టవచ్చు అని నమ్మి, అది ఆచరణలో పెట్టే నాయకుడు పాత్ర అని.. ఈ పాత్ర కోసం కన్నడ హీరో ఉపేంద్ర ను తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

ఈ సినిమా సెకండ్ హాఫ్ లో వచ్చే ఈ స్పెషల్ రోల్ సినిమాకే హైలైట్ గా నిలుస్తోందట. మరి ఈ పాత్ర చేయడానికి ఉపేంద్ర ఒప్పుకుంటాడో లేదో చూడాలి. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ తన కెరీర్ లోనే బెస్ట్ లుక్‌లో కనిపించబోతున్నాడు. వెరీ స్టైలిష్ లుక్ లో విభిన్న శైలితో చరణ్, ఈ సినిమాలోనే ప్రధాన హైలైట్‌ గా నిలుస్తాడట. పైగా ఈ సినిమాలో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. వీటిలో ఒక పాత్రలో గ్రామీణ యువకుడిగా, మరో పాత్రలో సూపర్ స్టైలిష్ గా కనిపిస్తాడట. చరణ్ లుక్ కోసం బాలీవుడ్ ప్రముఖ హెయిర్‌ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ పనిచేస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు