కమల్‌ – శంకర్‌ సినిమా షూట్ ఆగడానికి కారణం అదేనా ?

Published on Jan 31, 2019 8:48 pm IST

లోక నాయకుడు కమల్‌ హాసన్ – టెక్ మాంత్రికుడు శంకర్‌ కలయికలో భారతీయుడు సీక్వెల్‌ ను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి స్పందన లభించింది. ఇక జనవరి 18 నుండి ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరగట్లేదని తెలుస్తోంది.

కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకి సంబంధించి సెట్ వర్క్ ఇంకా పూర్తి కాకపోవడం వల్ల షూట్ మధ్యలో ఆపాల్సి వచ్చిందట. ఈ సినిమాలో తెలుగు కమెడియన్ వెన్నల కిషోర్ కూడా ఓ కామిక్ పాత్రను చేయనున్నాడు. అలాగే మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, తమిళ్ హీరో శింబు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారని తెలుస్తోంది.

కమల్ సరసన కాజల్ అగర్వాల్ కథానాయకిగా నటిస్తోంది. అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్ముస్తోంది.

సంబంధిత సమాచారం :

X
More