రజినీకాంత్ ‘విక్రమ సింహా’ రిలీజ్ డేట్

rajnikanths_Kochadaiiyaan
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరోగా నటిస్తున్న గ్రాఫికల్ మానియా ‘కొచ్చాడియాన్’. ఈ సినిమాని తెలుగులో ‘విక్రమ సింహా’గా రిలీజ్ చేయనున్నారు. గత సంవత్సరం దీపావళి నుంచి ఇదిగో రిలీజ్ అదిగో రిలీజ్ అంటూ వస్తున్న వార్తలకు ఈరోస్ ఇంటర్నేషనల్ వారు తెరదించేసారు. తాజాగా వారు విడుదల చేసిన ప్రెస్ నోట్ లో ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 11న రిలీజ్ చేయనున్నట్లు తెలియజేశారు.

ఈ రోస్ ఇంటర్నేషనల్ – మీడియా వన్ గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ వారు కలిసి నిర్మించిన ఈ సినిమాకి సౌందర్య అశ్విన్ దర్శకత్వం వహించారు. హాలీవుడ్ లో అవతార్, బేవుల్ఫ్ చిత్రాలకు ఉపయోగించిన ఫోటో రియలిస్టిక్ పెర్ఫార్మన్స్ క్యాప్చూర్ టెక్నాలజీని ఉపయోగించి ఈ సినిమాని తెరకెక్కించారు. ‘కొచ్చాడియాన్’ సినిమా పాండ్యన్ కింగ్ అయిన కొచ్చాడియాన్ రణదీరన్ జీవిత కథ. దీపికా పడుకొనే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శరత్ కుమార్, శోభన తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.