మహేష్ బాబు ‘ఆగడు’ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్

Published on Mar 24, 2014 11:39 am IST

Mahesh-Babu-Aagadu
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం హీరోగా నటిస్తున్న మాస్ ఎంటర్టైనర్ ‘ఆగడు’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. గత కొంతకాలంగా మహేష్ బాబు తన సినిమాలకు సంబందించిన ఫస్ట్ లుక్ ని సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసారు. ‘ఆగడు’ సినిమాకి కూడా అదే సెంటిమెంట్ ని ఫాలో కానున్నారు. ఈ చిత్ర నిర్మాతలు కృష్ణ గారి పుట్టిన రోజు అయిన మే 31న ఆగడు మూవీ ఫస్ట్ లుక్ ని లాంచ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు.

రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు లుక్ ఎలా ఉందో తెలియాలంటే మే 31 వరకు ఆగాల్సిందే. తమన్నా ఇటీవలే ఆగడు షూటింగ్ లో జాయిన్ అయ్యింది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకి శ్రీను వైట్ల డైరెక్టర్. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు మహేష్ బాబుతో చేస్తున్న ఈ మూడవ సినిమాకి థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :