“కేజీఎఫ్ చాప్టర్-2” ఆలస్యం అందుకేనా?

Published on Jul 28, 2021 1:04 am IST

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన “కేజీఎఫ్ చాప్టర్-1” సంచలనాలు సృస్టించిన సంగతి తెలిసిందే. దీనికి సీక్వెల్‌గా వస్తున్న “కేజీఎఫ్ చాప్టర్-2″పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కరోనా కారణంగా వాయిదాపడ్డ ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా దాదాపు పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. కొద్ది రోజుల క్రితం ఈ సినిమా రిలీజ్ డేట్‌పై స్పందించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ హాల్ నిండా గ్యాంగ్‌స్టర్లు ఉన్నప్పుడు మాత్రమే మాన్‌స్టర్ వస్తాడని, అతను వచ్చే కొత్త తేదీనీ త్వరలోనే ప్రకటిస్తామని చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడిప్పుడే థియేటర్లు తెరుచుకోవడంతో చిన్న చిన్న సినిమాలు వరుసపెట్టి రిలీజ్ తేదీలను ప్రకటిస్తున్నాయి కానీ “కేజీఎఫ్ చాప్టర్-2” రిలీజ్ డేట్‌ని మాత్రం దర్శక నిర్మాతలు ఇంకా లాక్ చేయలేదు. అయితే కొత్త విడుదల తేదీని ప్రకటించకపోవడానికి ఓ చిన్న కారణం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రధానమైన ప్రతినాయకుడి పాత్ర అధీరాగా బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన అనారోగ్యం కారణంగా షూటింగ్ షెడ్యూల్ కాస్త తారుమారు అయ్యిందని, ‘కేజీఎఫ్-2’ హిందీ వెర్షన్‌కు తానే డబ్బింగ్ చెబుతానని సంజయ్ దత్ అంటున్నారని ఈ విషయంలో కూడా కొంత ఆలస్యం అవుతోందని, ఇది పూర్తయ్యాకనే దక్షిణాది భాషల్లో ఆయన పాత్రకు డబ్బింగ్ చెప్పించాల్సి ఉంటుంది. ఈ కారణాల చేతనే సినిమా విడుదలకు కాస్తంత సమయం పడుతోందని అందుకే ఇంకా మాన్‌స్టర్ వచ్చే డేట్ లాక్ చేయలేదని సమాచారం.

సంబంధిత సమాచారం :