‘వకీల్ సాబ్’ పరాజయం… ఒక విషయం మాత్రం క్లియర్

Published on Apr 23, 2021 6:09 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలైంది. 90 కోట్ల పైచిలుకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ పెట్టుకుని బరిలోకి దిగిన ఈ చిత్రం అనేక ఆటుపోట్లను తట్టుకుని మొదటి వారంలో మంచి వసూళ్లను రాబట్టింది. కానీ తరవాత కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. కరోనా కేసులు పెరగడం, టికెట్ ధరలు తగ్గడం లాంటి కారణాలతో కలెక్షన్స్ డల్ అయ్యాయి. ఇక ఓవర్సీస్ విషయానికొస్తే సినిమా నష్టాలతోనే ముగిసేలా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో హిట్ తెచ్చుకున్నప్పటికీ అమెరికాలో చిత్రం డీలా పడింది. ఇప్పటివరకు చిత్రం 7,50,000 డాలర్లను మాత్రం వసూలు చేసింది. ప్రజెంట్ ఉన్న రన్ చూస్తుంటే మిలియన్ మార్క్ తాకడం దాదాపు అసాధ్యమే అనిపిస్తోంది. మరి ఈ పరాజయానికి రీజన్ ఏమిటీ అంటే ‘వకీల్ సాబ్’ రీమేక్ సినిమా కావడమే అనే మాటలు వినిపిస్తున్నాయి. ‘వకీల్ సాబ్’ హిందీ పింక్ చిత్రానికి రీమేక్. తెలుగులో కంటే ముందే తమిళంలో రీమేక్ అయింది. ఈ రెండు వెర్షన్లు మంచి హిట్లు. చాలామంది ఈ వెర్షన్లను చూసేశారు.

అందుకే యూఎస్ ఆడియన్స్ ఈ రీమేక్ సినిమా పట్ల అంతగా ఆసక్తి చూపలేదు. ఫలితంగా సినిమా నష్టాలతో మిగిలిపోయేలా ఉంది. ‘వకీల్ సాబ్’ కంటే ముందు విడుదలైన చిన్న సినిమా ‘జాతిరత్నాలు’ మిలియన్ మార్క్ తాకింది. దీన్నిబట్టి ఓవర్సీస్ ప్రేక్షకులు రీమేక్ సినిమాల పట్ల అంత ఆసక్తిగా లేరని అర్థమవుతోంది.

సంబంధిత సమాచారం :