బ్లాక్ బస్టర్ ‘ఠాగూర్’ హిందీ రీమేక్.. వినాయక్ ఎందుకు రిజెక్ట్ చేశాడో తెలుసా..?

బ్లాక్ బస్టర్ ‘ఠాగూర్’ హిందీ రీమేక్.. వినాయక్ ఎందుకు రిజెక్ట్ చేశాడో తెలుసా..?

Published on Mar 26, 2026 9:00 AM IST

vv-vinayak

మాస్ యాక్షన్ సినిమాల దర్శకుడు వి.వి.వినాయక్, మెగాస్టార్ చిరంజీవితో తాను రూపొందించిన ‘ఠాగూర్’ సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసే అవకాశం ఒక అగ్ర హీరోతో వచ్చిందని, కానీ భాషా సమస్య కారణంగా ఆ అవకాశాన్ని వదులుకున్నానని ఆయన వెల్లడించారు. “హిందీ రాకపోవడం వల్ల ఆ సినిమా చేయలేకపోయాను, అప్పుడే చదువు ప్రాముఖ్యత నాకు అర్థమైంది” అని ఆయన పేర్కొన్నారు.

​తమిళ చిత్రం ‘రమణ’కు రీమేక్‌గా వచ్చిన ‘ఠాగూర్’ అప్పట్లో సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇదే సందర్భంలో తన మిత్రులైన జూనియర్ ఎన్టీఆర్, రాజీవ్ కనకాల గురించి కూడా వినాయక్ మాట్లాడారు. తాము ముగ్గురం ప్రాణ స్నేహితులమని, కెరీర్ ఆరంభంలో కలిసి ఎన్నో కలలు కనేవారమని ఆయన గుర్తుచేసుకున్నారు.

​ప్రస్తుతం వి.వి.వినాయక్ బాక్సాఫీస్ వద్ద తనదైన మార్క్ చూపించేందుకు సిద్ధమవుతున్నారు.

తాజా వార్తలు