‘వారణాసి’ కోసం జక్కన్న తొలిసారి అలా.. ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్..!

‘వారణాసి’ కోసం జక్కన్న తొలిసారి అలా.. ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్..!

Published on Mar 26, 2026 10:01 AM IST

Varanasi

స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి తన సినిమాల విషయంలో ఏమాత్రం రాజీపడరని, పర్ఫెక్షన్ కోసం ఎంత సమయమైనా తీసుకుంటారని అందరికీ తెలిసిందే. ఆయన నుంచి ఓ సినిమా వస్తుందంటే, అది అన్ని విధాలుగా పర్ఫెక్ట్ ఉన్నాకే రిలీజ్‌కు వెళ్తారు. గతంలో ‘బాహుబలి’ వంటి భారీ చిత్రం సమయంలో కూడా రిలీజ్ డేట్ మారింది. విజువల్ అవుట్‌పుట్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనుల విషయంలో ఆయన ఫాలో అయ్యే స్ట్రాటెజీ వల్ల సాధారణంగా షూటింగ్ షెడ్యూల్స్ ఆలస్యమవుతుంటాయి.

అయితే, ఆయన తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘వారణాసి’ విషయంలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు జరిగిన షూటింగ్ అంతా ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారమే ఎలాంటి అడ్డంకులు లేకుండా సాగుతోంది. ఈ చిత్రానికి సంబంధించి రాజమౌళి మరియు టీమ్ అత్యంత డిసిప్లిన్‌గా వ్యవహరిస్తూ, అనుకున్న సమయానికి పనులన్నీ పూర్తి చేస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా షూటింగ్‌ను ఆగస్టు నాటికి పూర్తి చేయాలని చిత్ర యూనిట్ లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయి. దీంతో ఏప్రిల్ 7, 2027న సినిమా రిలీజ్ చేయాలనే టార్గెట్ మిస్ అయ్యే ఛాన్స్ లేదని జక్కన్న అండ్ టీమ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఆయన తన కెరీర్‌లో తొలిసారి డెడ్‌లైన్ పెట్టుకుని మరీ వర్క్ చేయడం ఇప్పుడు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

తాజా వార్తలు