ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) హీరోగా చేస్తున్న పలు అవైటెడ్ చిత్రాల్లో క్రేజీ సీక్వెల్ చిత్రం “కల్కి 2” (Kalki 2) కూడా ఒకటి. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన వరల్డ్ క్లాస్ చిత్రం ‘కల్కి 2898 ఎడి’ సీక్వెల్ కి ఇండియా వైడ్ ఆడియెన్స్ లో మంచి హైప్ ఉంది. అయితే పార్ట్ 2 షూట్ ఎప్పుడో మొదలు కావాల్సి ఉంది కానీ ప్రభాస్ ఇతర కమిట్మెంట్స్ మూలాన ఆగుతూ వచ్చింది.
కానీ ఇటీవల వచ్చిన బజ్ ప్రకారం ఫైనల్ గా కల్కి 2 (Kalki 2) షూట్ కి ప్రభాస్ సిద్ధం అయ్యినట్టు తెలుస్తుంది. తాజా అప్డేట్ ప్రకారం కల్కి 2 షూట్ ని ఈ ఫిబ్రవరి 2 నుంచి డార్లింగ్ హీరో మొదలు పెట్టనున్నట్టు తెలుస్తుంది. సో ఫైనల్ గా కల్కి 2 ఫ్యాన్స్ కి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
దీనితో పాటు స్పిరిట్ షూట్ ని కూడా ప్రభాస్ బాలన్స్ చేస్తూ వెళతాడని వినికిడి. ప్రస్తుతం కల్కి 2 (Kalki 2) కి దీపికా (Deepika Padukone) పాత్రకి రీప్లేస్ మెంట్ పనులు కూడా జరుగుతున్నాయట. ఇక ఈ భారీ సినిమాలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లాంటి దిగ్గజాలు కూడా నటిస్తుండగా సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే వైజయంతి సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.


