మన తెలుగు సినిమా నుంచి కూడా చాలా తక్కువ మంది హీరోలు తమ స్పేస్ ని దాటి అప్పుడపుడు మంచి ప్రయోగాలు కూడా చేస్తూ ఉంటారు. అది తాము ఎంచుకునే స్క్రిప్ట్ పరంగా కానీ ఆయా చిత్రాలకి తమ లుక్స్ పరంగా కానీ ఆడియెన్స్ లో మంచి థ్రిల్స్ చేస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇలా లేటెస్ట్ గా ఇద్దరు హీరోస్ మన టాలీవుడ్ నుంచి ఫ్యాన్స్ కి మంచి ఫీస్ట్ ఇచ్చారు.
మాస్ మహారాజ రవితేజ అలాగే సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవర కొండలు నటిస్తున్న తమ చిత్రాలు ఇరుముడి, రణబాలి సినిమాల ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ ఇప్పుడు నమోదు అవుతుంది. పైగా రెండు సినిమాల పోస్టర్స్ లో కూడా ఇద్దరు స్టార్స్ డివోషన్ మోడ్ లో కనిపిస్తూ ఉండడం విశేషం.
అంతే కాకుండా రణబాలి లుక్ కి అయితే మన స్టార్స్ అందరి వెర్షన్ లోనూ ఏ ఐ తో ఫోటోలు చేసేస్తున్నారు. ఇందులో మాస్ మహారాజ్ లుక్ కూడా ఉంది. ఇలా మన స్టార్స్ నుంచి ఏకకాలంలో వచ్చిన రెండు పోస్టర్స్ కి కూడా సాలిడ్ రెస్పాన్స్ రావడం అనేది విశేషం. ఇక ఇరుముడి చిత్రాన్ని శివ నిర్వాణ తెరకెక్కిస్తుండగా రణబాలి భాద్యతలు దర్శకుడు రాహుల్ అందుకున్నాడు.


