Border 2: వసూళ్ళలో ‘బోర్డర్ 2’ మరో రికార్డు మైల్ స్టోన్!

Border 2: వసూళ్ళలో ‘బోర్డర్ 2’ మరో రికార్డు మైల్ స్టోన్!

Published on Jan 28, 2026 12:00 PM IST

Border 2

బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సన్నీ డియోల్ హీరోగా నటించిన లేటెస్ట్ వార్ బ్యాక్ డ్రాప్ చిత్రమే “బోర్డర్ 2” (Border 2). గత రెండున్నర దశాబ్దాల కితం వచ్చిన సెన్సేషనల్ హిట్ బోర్డర్ కి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా మళ్ళీ భారీ వసూళ్లతో దూసుకెళ్తుంది. కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ బాలీవుడ్ ఆడియెన్స్ ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ అందించారు.

మొదటి నాలుగు రోజుల్లోనే సుమారు 200 కోట్ల దగ్గరకి వచ్చేసిన ఈ సినిమాలో ఐదు రోజుల్లో 200 కోట్ల మార్క్ ని దాటేసినట్టు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ఇలా నిన్న ఐదో రోజు బోర్డర్ 2 (Border 2) కి ఇండియా వైడ్ గా 23.31 కోట్ల నెట్ వసూళ్లు రాగా మొత్తం 5 రోజుల్లో ఈ చిత్రం 216.79 కోట్ల నెట్ వసూళ్లు కేవలం ఇండియా నుంచి అందుకొని అదరగొట్టింది.

ఇలా సన్నీ డియోల్ కెరీర్ లో గదర్ 2 తర్వాత మరో బిగ్గెస్ట్ గ్రాసర్ గా దూసుకెళ్తుంది. ఇక ఈ చిత్రానికి అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించగా వరుణ్ ధావన్ తదితర ముఖ్య నటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. అలాగే టీ సిరీస్ వారు నిర్మాణం వహించారు.

తాజా వార్తలు