రెచ్చిపోదాం అంటున్న ఎఫ్ 2 బ్రదర్స్ !

Published on Dec 19, 2018 12:40 pm IST

విక్టరీ వెంకటేష్ , వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ ‘ఎఫ్ 2’ చిత్రం ప్రమోషన్స్ ను వేగవంతం చేస్తుంది చిత్ర బృందం. అందులో భాగంగా ఇటీవల ఈ చిత్ర టీజర్ ను విడుదలచేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈ చిత్రంలోని ‘రెచ్చిపోదాం బ్రదర్’ అనే సాంగ్ యొక్క టీజర్ ను ఈ రోజు సాయంత్రం 5గంటలకు విడుదలచేసి పూర్తి లిరికల్ సాంగ్ ను రేపు సాయంత్రం 5 గంటలకు రివీల్ చేయనున్నారు.

అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్లో వెంకీ సరసన తమన్నా అలాగే వరుణ్ కు జోడిగా మెహ్రీన్ నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్రకాష్ రాజ్ , రాజేంద్ర ప్రసాద్ , ప్రియదర్శి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా జనవరి 12న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :