చైనా బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న అవెంజర్స్ ఎండ్ గేమ్ !

Published on Apr 25, 2019 1:00 pm IST

ప్రపంచ వ్యాప్తంగా అవెంజర్స్ ఎండ్ గేమ్ మానియా మొదలైయింది. ఈనెల 26న ఈ చిత్రం విడుదలకానుండగా టికెట్స్ దొరకని పరిస్థితి నెలకొంది. ఒక్క ఇండియాలోనే ఇప్పటికే 10లక్షల టికెట్స్ అమ్ముడయ్యాయంటే క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధమవుతుంది. ఇక ఆల్రెడీ కొన్ని ఏషియన్ కంట్రీస్ లో ఈ సినిమా ను నిన్ననే విడుదలచేశారు.

అందులో భాగంగా చైనా లో విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు రికార్డు స్థాయిలో 750కోట్ల వసూళ్లను రాబట్టిందని సమాచారం. దాంతో ఆసియా లోనే ఇప్పటివరకు మొదటి రోజు అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ చిత్రం దెబ్బకు అవతార్ రికార్డ్స్ కూడా గల్లంతుకానున్నాయి.

ఇక ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ స్థాయిలో విడుదలకావడంతో పెద్ద సినిమాల విడుదలను వాయిదా వేసుకున్నారు. మరి ఫుల్ రన్ లో ఈ చిత్రం ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :