క్రేజీ : “మహేష్ 28” కి అప్పుడే రికార్డు ఫిగర్స్.!

Published on Mar 5, 2023 7:01 am IST

ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి రాబోతున్న పలు క్రేజీ కాంబినేషన్ తో కూడిన చిత్రాల్లో దర్శకుడు త్రివిక్రమ్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న భారీ సినిమా కూడా ఒకటి. మహేష్ కెరీర్ లో 28వ సినిమాగా ప్లాన్ చేస్తున్న ఈ సినిమా మహేష్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో సహా భారీ యాక్షన్ ఎలిమెంట్స్ తో ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సినిమా అయితే ఓవర్సీస్ లో ఈ క్రేజీ కాంబినేషన్ కి ఉన్న పవర్ చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది.

మరి ఈ సినిమాకి ఒక్క యూఎస్ లోనే 4 మిలియన్ కి పైగా బిజినెస్ జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఇది పాన్ ఇండియా కానీ చిత్రాల్లో బిగ్గెస్ట్ రికార్డు అని చెప్పాలి. అలాగే రిలీజ్ సమయానికి ఇంకా పెరిగే ఛాన్స్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి అయితే ఈ సెన్సేషనల్ కాంబోలో సినిమాకి డిమాండ్ నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పాలి. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా హారికా హాసిని వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :