“శ్రీకారం” డిజిటల్ ప్రీమియర్ కు రికార్డ్ స్థాయి రెస్పాన్స్.!

Published on Apr 30, 2021 1:00 pm IST

మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో శర్వానంద్ కూడా ఒకడు. తనదైన సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఇస్తూ వస్తున్న శర్వా లేటెస్ట్ గా నటించిన చిత్రం “శ్రీకారం”. దర్శకుడు కిషోర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత మార్చ్ 11న విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

వ్యవసాయంపై సందేశాత్మక చిత్రంగా వచ్చిన ఈ సినిమా లేటెస్ట్ గానే స్ట్రీమింగ్ యాప్ సన్ నెక్స్ట్ లో డిజిటల్ ప్రీమియర్ గా వచ్చింది. మరి దీనికి గాను భారీ రెస్పాన్స్ వచ్చినట్టుగా తెలుస్తుంది. రీసెంట్ గా వచ్చిన ఏ సినిమాల్లో కూడా సన్ నెక్స్ట్ లో రాని స్పందన మిలియన్స్ కొద్దీ వ్యూస్ లో వచ్చినట్టు మేకర్స్ తెలిపారు.

అయితే అప్పుడు గట్టి పోటీ పరంగా ఫుల్ రన్ లో లాభాల బాట పట్టలేదు కానీ ఓటిటిలో మాత్రం సూపర్ సక్సెస్ అయ్యిందని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించగా 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు. అలాగే ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం :