“దళపతి 67” కి రికార్డు నాన్ థియేట్రికల్ బిజినెస్?

“దళపతి 67” కి రికార్డు నాన్ థియేట్రికల్ బిజినెస్?

Published on Nov 25, 2022 6:44 PM IST

ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ హీరోగా ఇప్పుడు నటిస్తున్న చిత్రం “వారిసు” కోసం అందరికీ తెలిసిందే. మన టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై తమిళ్ మరియు తెలుగులో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఈ చిత్రం తర్వాత విజయ్ తన కెరీర్ లో 67వ సినిమాని దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ తో చేయనుండగా దీనిపై అయితే తారా స్థాయి అంచనాలు నెలకొన్నాయి.

ఈ చిత్రాన్ని లోకి యూనివర్స్ లో భాగంగా ప్లాన్ చేస్తూ ఉండగా ఇప్పుడు అయితే ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కుల డీల్ పై పలు రూమర్స్ ఫ్రెష్ గా బయటకి వచ్చాయి. మరి వీటి ప్రకారం అయితే ఈ చిత్రానికి జస్ట్ నాన్ థియేట్రికల్ హక్కులే.. అంటే డిజిటల్ మరియు శాటిలైట్ హక్కులు ఒకటే ఏకంగా 160 కోట్లు పలికినట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో కానీ ప్రస్తుతం ఈ టాక్ మంచి ఆసక్తిగా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు